వైయస్ఆర్సీపీ సామాజిక చైతన్యయాత్ర సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మళ్ళీ వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ పేదల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే.. వైయస్ జగన్ పది అడుగులు ముందుకు వేశారు. టీడీపీ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ, సీఎం వైయస్ జగన్ పాలనలో మాత్రం బడుగు బలహీవర్గాలకు పెద్ద పీట వేశారు అని అన్నారు.