గురువారం ఇడుపులపాయ హెలిప్యాడ్ నందు సాయంత్రం 5.50 గంటల నుండి 6.40 గంటల వరకు సీఎం జగన్ అక్కడ ఉన్నవారి నుండి ముఖ్యమంత్రి అర్జీలను స్వీకరించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి వాహనంలో సాయంత్రం గెస్ట్ హౌస్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. జిల్లా పర్యటన లో బాగంగా రెండో రోజు శుక్రవారం (10.11.23) ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఇడుపులపాయ నెమళ్ల పార్కులో వేముల ప్రజాప్రతినిధులతో జరిగే రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.