నవంబర్15న విజయవాడలో జరిగే సీపీఎం ప్రజారక్షణ భేరి బహిరంగసభకు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. శనివారం రాజాంలో ప్రచార జాతను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ప్రజల పక్షాన నిరంతరం సిపిఎం పార్టీ పనిచేస్తుందని తెలిపారు.