వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఈ రాష్ట్రంలో 65 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. 2019 లో జగనన్న అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతానికి పైగా ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టానని చెప్పే వ్యక్తి మనకి అవసరమా? బాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎన్నో నాటకాలతో వస్తారు తస్మాత్ జాగత్త! రాయలసీమలో పుట్టిన లోకేష్ అనే పప్పును చూస్తే జాలేస్తోంది. అయ్యని జైల్లో వేస్తే ఢిల్లీకి పారిపోయాడు. ఒక ఊరిలో ఇద్దరు బాగుపడాలంటే బాబు కావాలి. కానీ ఆ ఊరిలో అందరూ బాగుపడాలంటే జగనన్న కావాలి అని తెలియజేసారు.