వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.... బాబు హయాంలో అన్నీ స్కాంలే. అందుకే ఆయన అధికారంలోఉండగా చేసిన కుంభకోణాలతో స్కాంల సీఎం గా పేరుగాంచారు. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే జగనన్న స్కీంల సీఎం అయ్యారు. జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఈ ప్రభుత్వం ఎంతగా ఆదరిస్తోందో అందరికీ తెలుసు. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి పుట్టిన రోజును పండగరోజు చేసిన ఘనత జగనన్నదే. జగనన్న హయాంలో వెనకబడిన కులాల్లో పుట్టినందుకు మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గర్వపడుతున్నారు. బడ్జెట్లో సింహభాగం మహిళలకే కేటాయించి, వారి సాధికారత తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్న దమ్మున్న నాయకుడు జగనన్న అని తెలిపారు.