అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. మొలకల చెరువు మూడురోడ్ల సెంటర్లో భారీ బహిరంగసభకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆద్యంతం అశేష జనవాహిని.. నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఉషాశ్రీచరణ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్ యాదవ్, హఫీజ్‌ఖాన్, ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.