వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మేల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ... ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అమరావతి–బెల్లంకొండ రోడ్డు శివుడి సాక్షిగా హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చాం. శరవేగంగా పనులు సాగుతున్నాయి. సదావర్తి భూములు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆక్రమించేందుకు పన్నాగం పన్నాడు. ఆ శంకరుడి భూములు ఆపేందుకు ఈ శంకరుడు వస్తాడని చెప్పాను. రూ.149 కోట్లతో బెల్లంకొండ రోడ్డు శాంక్షన్ చేయించాం. కోర్టులో కేసు వేసి ఆపేందుకు యత్నించారు. రూ.66 కోట్లతో జగ్గయ్యపేట నుంచి బ్రిడ్జిని నిర్మించేందుకు శాంక్షన్ చేయించుకున్నాం. టెండర్లు సిద్ధమవుతున్నాయి. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ అమరావతి నుంచి ఆ అమరావతికి రోడ్డు కూడా వేయలేదు. దాన్ని రూ.44 కోట్లతో శాంక్షన్ చేయించాం. అదీ జగన్మోహన్రెడ్డి గారి హయాంలోనే జరుగుతోంది. నియోజకవర్గంలో స్కూళ్లకు రూ.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.