వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... మన పిల్లల ఫీజులు కట్టి, అమ్మ ఒడికి డబ్బులు ఇచ్చిన జగనన్న. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నారు. చంద్రబాబు రాజకీయాల కోసం పింఛన్ పెంచుతానన్నాడు. జగనన్న అవ్వాతాతల కోసం రూ.3 వేలకు పెంచుకుంటూ పోతున్నారు. చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పథకం వెన్నుపోటు. దాని ద్వారా రామారావును చంపాడు. సైకిల్‌ను, హోదాను లాక్కున్నాడు. పేద పిల్లల ఇంగ్లీషు మీడియం విద్యపై కోర్టుకెళ్లిన చంద్రబాబు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జగనన్న రాజధాని అమరావతి ప్రాంతంలో 53 వేల ఇళ్ల స్థలాలిస్తే, అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండటానికి లేదని కోర్టుకు వెళ్లిన చంద్రబాబు. తాడేపల్లిలో నేనున్నాను.. నా పక్కనే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు ఉండాలని ఇక్కడే స్థలాలిచ్చిన జగనన్న. పేదల ఆకలిడొక్కలను తడిమి చూసిన జగనన్న. వారి ఆకలి తీరుస్తున్నాడు. సామాన్య కార్యకర్తను పార్లమెంటుకు పంపిన జగనన్న. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన జగనన్న. దళితులకు 5 మంత్రి పదవులిచ్చారు. దళిత మహిళను హోంమినిస్టర్‌ను చేసిన ఘనత జగనన్నది. హెల్త్ మినిస్టర్‌గా బీసీ మహిళను చేశారు.