వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.... నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పగలిగే నాయకుడు దేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలోనే సామాజిక సాధికారత యాత్రకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్ననే. వెనుకబడిన తరగతులకు రూ.70,794 కోట్లు, ఎస్సీలకు రూ.60,430, ఎస్టీలకు రూ.20,130 కోట్లు, మైనార్టీలకు రూ.13,470 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన ఘనత జగనన్నదే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్దాయిలో సంక్షేమంకోసం ఏ ముఖ్యమంత్రి ఖర్చుపెట్టలేదు. 56 వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ట్రైబల్ కమిషన్ లేదు, గిరిజనులకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదు అని తెలిపారు.