వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ...... గిరిజనులకు, బడుగు, బలహీలన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న మేలును ఎన్నడూ మరిచిపోకూడదని, మరిస్తే మనకే ఇబ్బందులు, కష్టాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీల కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేసారా అని ప్రశ్నించారు. ఎస్సీల కోసం గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, జగన్ రూ. 61 వేల కోట్లు ఖర్చు చేసారన్నారు. బీసీల కోసం ఒక లక్షా అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసారన్నారు. గిరిజనుల కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ ఖర్చు చేయగా, చంద్రబాబు కేటాయింపులను పూర్తిగా చేయలేదని గుర్తు చేసారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ లో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించలేదని, జీసీసీ కి చైర్మన్ ను వేయలేదని, ఎస్టీ కమిషన్ ను కూడా నియమించలేదని విమర్శించారు. పోడు, బీడు, బంజరు భూములను గిరిజనులకు జగన్ పంపిణీ చేయగా, భూములపంపిణి హామీ ఇచ్చిన చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. గిరిజనులకు రెండెకరాలు భూమి ఇస్తానని చెప్పి టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు. గిరిజనులను మోసగించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.