అక్రమ కేసులు పెట్టినా ఎవరు భయపడవద్దని కార్యకర్తలకు అండగా టీడీపీ పార్టీ మరియు స్థానికంగా నేను అండగా ఉంటామని పరిటాల సునీత సూచించారు.ఆమె విలేకరులతో మాట్లాడుతూ..... తనపై కూడా అక్రమ కేసులు బనాయించారని, అధికారం వచ్చాక అక్రమ కేసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ఆమె అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వందలాదిమందిపై కేసులు పెట్టి, అందులో కొందరిని జైలుకు పంపించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని అన్నారు. చాలా మంది కార్యకర్తలు అక్రమ కేసులతో ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వారికి పార్టీ న్యాయ సహాయం అందిస్తుందని అన్నారు.