నాయుడుపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్ లో సోమవారం తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చెందేటి సుజాత, గుంట మడుగు సుగుణమ్మ ల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైకాపా అరాచకాలను వివరించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయనున్న ఆరు పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. భవాని, లక్ష్మి, సుజాత, సుభాషిణి, నాగమ్మ పాల్గొన్నారు.