విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ, జనసేన పార్టీ నాయకుల సమన్వయ సమావేశాలు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు/నియోజకవర్గ ఇన్చార్జులు, రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. మంగళవారం భీమిలి, విశాఖ పశ్చిమ, 15న గాజువాక, విశాఖ ఉత్తరం, 16వ తేదీన విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.