భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 23న విశాఖపట్నం పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియానికి కొత్త కళ తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా గ్యాలరీలలో శిధిలావస్థకు చేరిన కుర్చీలను తొలగించి వాటి స్థానంలో ఏడు వేల కొత్త కుర్చీలను ఏర్పాటుచేస్తున్నారు. ఇక ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్స్ అందంగా తీర్చిదిద్ది ఆఽధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదేవిధంగా గ్యాలరీలలోని మరుగుదొడ్లను కూడా పునర్నిర్మిస్తున్నారు. స్టేడియం చుట్టూ వున్న ప్రహరీ గోడలకు రంగులు దిద్దతున్నారు.