రాబోయే ఎన్నికల్లో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఏ గొడవలు జరగడానికి అవకాశం ఉండకూడదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగ కూడదన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో మంచి వాతావరణం ఉన్నప్పటికీ భూ తగాదాల్లో ఎక్కువగా యువకుల పాత్ర ఉందన్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే వారి భవిష్యత్ నష్టపోతారని, కావున ఆ గ్రామాల్లో పర్యటించి పెద్దలతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని ఏ గొడవలు లేకుండా చూసుకోవాలని పెద్దలను, యువతకు కోరారు. గ్రామాల్లో పీస్‌కమిటీలు ఏర్పాటు జరిగిందని వాటి ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక ఎస్‌ఐ, సీఐ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. 22 ఏళ్లు పైబడిన వారు కేసుల్లో నమోదైతే చేసేది ఏమీఉండదని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట పెద్దాపురం డీ ఎస్పీ లతాకుమారి, జగ్గంపేట సీఐ సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, కిర్లంపూడి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.