ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటరు జాబితాలోమీకు ఓటు లేకపోతే.. ఆలస్యం చేయకుండా ఫాం-6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకోండి అని అధికారులు తెలియజేస్తున్నారు. మీ గ్రామంలోనే మీ ఏరియా పోలింగ్ బూత్ బీఎల్‌వో వద్ద ఫాం-6 దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వో) ఉంటారు. ప్రతి మండలంలోనూ తహశీల్దార్ లేదా డిప్యూటీ తాహశీల్దార్‌లు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారు. వారి కార్యాలయాల్లోనూ ఫాం-6 దరఖాస్తులు అందించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa