పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత సొమ్మును ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు-నవంబరు మధ్య విడుదల చేయాల్సిన రూ.2వేలను ఇప్పుడు చెల్లించనున్నారు. రాష్ట్రంలో జూన్‌లో 41.73లక్షల లబ్ధిదారులకు పీఎం కిసాన్ చెల్లింపులు జరిపారు. ఈసారి రైతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకానికి అర్హత ఉండి, ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులందరి ఖాతాలకు సొమ్ము జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa