కర్నూలు జిల్లాలోని క్రిష్ణగిరి, తుగ్గలి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.... క్రిష్ణగిరి తుగ్గలి మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని, రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయన్నారు. అనంతరం సీపీఐ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందిస్తూ క్రిష్ణగిరి, తుగ్గలి మండలాలను కరువు మం డలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, లేనిన్బాబు, రవిమోహన్ పాల్గొన్నారు.