టీడీపీ నేత చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని దుర్మార్గంగా కుట్ర చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబుపై అక్రమంగా ఆరు కేసులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారు. దొంగ ఓట్లపై ఏ కలెక్టర్, తహశీల్దార్ స్పందించడం లేదు. ప్రతి నియోజక వర్గంలో 25 వేల దొంగ ఓట్లు చేర్చారు. సకల శాఖ మంత్రి సజ్జల ఒక సన్నాసోడు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వెన్నెముక లేకుండా పని చేస్తున్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్ చంద్రబాబు రూ. 150కి ఇస్తే.. జగన్ రూ. 350 వసూలు చేస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తే చంద్రబాబుపై కేసు పెట్టారు. ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్‌లో 2.50 లక్షల కోట్లు జగన్ కొట్టేశారు. సీఎం జగన్ కొట్టేసిన డబ్బు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్కిస్తాం.’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.