మండల కేంద్రమైన అచ్చంపేటలో రోడ్లపై ఏర్పడిన గుంతలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంయుక్తంగా శనివారం నిరసన వ్యక్తం చేశారు. గుంతలు చూపుతూ ఇదే రోడ్ల పరిస్థితిని వారు వివరించారు. గుంతల రాజ్యం అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం, పార్టీ నాయకులు , కార్యకర్తలు , జనసేన నాయకులు పాల్గొన్నారు.