ద్విచక్ర వాహనం చోరీపై శుక్రవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు పేటకు చెందిన సతీష్ తన ఇంటి వద్ద ఉదయం 11 గంటలకు వాహనం నిలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి చూస్తే తన వాహనం కనిపించ లేదని, వెతికినా ఆచూకీ తెలియ లేదని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు.