వైసీపీ అసమర్ధ పాలనకు రాష్ట్రంలోని రహదారులే నిదర్శనమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిలకలూరిపేట మండల పరిధిలోని మద్దిరాల-గోపాలవారిపాలెం రహదారిని టిడిపి-జనసేన నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వైసీపీ చేసిన అభివృద్ధి వారి సోషల్ మీడియాలో తప్ప, ప్రత్యక్షంగా ఎక్కడా లేవని విమర్శించారు.