ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న పేదవారిని ఎంతగానో ఆదుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం చిలకలూరిపేట నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 27 లక్షల 88 వేల రూపాయల చెక్కులను ఆమె అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సీఎం జగన్ కు, మంత్రి రజినీకి కృతజ్ఞతలు తెలిపారు.