విశాఖపట్నం, గ్రామీణ ప్రాంతాలలో నడుపుతున్న ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, స్కానింగ్ కేంద్రాలు, ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పని సరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డి.ఎం. హెచ్.ఒ ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa