అనంతపురంలో నిర్వహిస్తున్న కురుబ సామాజిక వర్గం గుడికట్ల ఉత్సవాల్లో.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత బీకే పార్థసారధి మధ్య గొడవ జరిగింది. కురుబల్లో ఐక్యత కొరవడిందన్న గోరంట్ల వ్యాఖ్యలను పార్థసారధి ఖండించారు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. తర్వాత మంత్రి ఉషశ్రీచరణ్, ఎంపీ గోరంట్ల సభ నుంచి వెళ్లి పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa