మంత్రివర్గ కూర్పు, రాజ్యసభ సభ్యత్వాలు, కార్పొరేషన్ల ఏర్పాటులో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతను జగన్ ఇచ్చారని,. శాసన మండలిలో కూడా బీసీలకే అగ్రతాంబూలం ఇచ్చారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వివరించారు.. 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒక పక్క వస్తే, చంద్రబాబు, పవన్ మరోవైపు మాయ మాటలతో వస్తున్నారని, ప్రజలు ఈ అంశాన్ని ఆలోచించాలన్నారు. 75 ఏళ్ల తర్వాత బీసీలకు రాజ్యాధికారం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి కావాలా, మళ్లీ 70 ఏళ్ల వెనక్కి వెళ్లేలా చంద్రబాబును తెస్తారో ప్రజలు ఆలోచన చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ను సీఎంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో నాకు మంత్రి పదవి ఇస్తే గొర్రెలు కాచుకునే వారికి ఇచ్చారని హేళన చేసారని, కానీ జగన్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకుని యాదవులకు ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గోడ్లు కాచుకునేవారిని, తర్వాత ప్రజల ఆరాధ్య దైవంగా మారారని గుర్తు చేసారు. పాలు అమ్ముకుంటున్నామనే నారా భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ ద్వారా యాదవుల మీద ఆధారపడి వ్యాపారం చేసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నమ్మకానికి మారుపేరు బీసీలు, అలాంటి వారిని జగన్ గుండెల్లో పెట్టుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. పవన్ వంటి సైడ్ అర్టిస్ట్ నాయకుడు అవసరామా లేదా అని యువత ఆలోచించాలన్నారు. సినిమాల్లో పవన్ పవర్ స్టార్ కావొచ్చు.. కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు జెండా మోస్తాడని, అలాంటి వాడిని నాయకుడుగా ఎలా గుర్తిస్తారో యువత ఆలోచన చేయాలని కోరారు. రాజకీయాల్లో ప్రజల కోసం దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే సీఎం జగన్ పిలుపునిచ్చినట్లుగా వై నాట్ 175 సాధించడం ఖాయమని అనిల్ కుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ఈ ఆరు నెలల్లో ఇతర పార్టీల నేతలు అనేక వేషాలు వేసుకుని వస్తారని, మోసపోయి బానిసలుగా మిగిలిపోదామా. జగన్ ను గెలిపించి రొమ్ము విరుచుకుని మళ్లీ రాజ్యాధికార పదవుల్లో కొనసాగుదామా అన్నది బీసీ నేతలు ఆలోచించాలన్నారు.