గుడివాడ పట్టణంలోని శివాలయాల్లో కార్తీక మాస తొలి సోమవార శోభ నెలకొంది. వేకువ జాము నుండే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్య స్నానాలు ఆచరించిన మహిళా భక్తులు శివాలయాలకు చేరుకొని దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.