స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు మధ్యంతర బెయిల్ పై ఉన్న షరతులే వర్తిస్తాయని పేర్కొంది. అయితే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో వాదించిన సీఐడీకి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాలు చేస్తూ సీఐడీ సుప్రీంకు వెళ్లే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.