శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ధర్మవరం శాసన సభ్యులు కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి దంపతులు మల్లికార్జున స్వామి ని మంగళవారం దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సన్మానించారు. ప్రజలు అందరు సంతోషంగా సుఖ శాంతులతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.