గోరంట్ల మండలం బూదిలి వద్ద గల చిత్రావతి వంతెన గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు, వరద వృధృతికి పూర్తిగా కొట్టుకు పోయిందని గ్రామస్థులు ఎమ్మెల్యే శంకర్ నారాయణ దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పీఎంజిఎస్ఐ నిధుల ద్వారా రూ 8 కోట్ల 52 లక్షలు నూతన వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేయించారు. ఈ సందర్బంగా మంగళవారం పెనుకొండలో ఎమ్మెల్యేని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.