కాకినాడ తీరంలో సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు నాటు పడవపై చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురు గాలులతో పాటుగా సముద్ర అలల తాకిడితో పడవ ప్రయాణం అనుకూలించలేదు. ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో ఐదుగురు జార్లు గల్లంతయ్యారు. ముగ్గురు జాలరులు ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. వీరిలో సూర్యారావు పేటకు చెందిన గరికిన సత్తిరాజు, దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు గల్లంతయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa