డీఆర్డీవో సాయంతో రూపొందించిన పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన సరికొత్త యాంటీ షిప్ మిస్సైల్‌ను భారత నౌకాదళం విశాఖపట్నం సమీపాన బంగాళాఖాతంలో హెలికాప్టర్ నుంచి ప్రయోగించి పరీక్షించింది. వరుణాస్త్ర వంటి మిస్సైల్స్‌ను ఇప్పటికే స్వదేశీయంగా తయారు చేసినప్పటికీ వాటిలో విదేశీ పరికరాలను వినియోగించారు. ఈసారి అలా కాకుండా పూర్తి స్వదేశీ సాంకేతికతతో డీఆర్డీవో ఈ యాంటీ షిప్ మిస్సైల్‌ను రూపొందించింది. దీన్ని నేవీ అధికారులు సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా ప్రయోగించారు.