జీ20 వర్చువల్ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైర్హాజరు కావడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. తమకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్న విషయంలో దేశం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
‘‘జీ20 ఢిల్లీ సదస్సులో కూడా చైనాకు వారి ప్రధాని లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహించారు. దానినే వర్చువల్ సమావేశంలోనూ కొనసాగించారు’’అని పేర్కొన్నారు.