వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేసి అసమానతలు, అఘాయిత్యాలు, దాడులు చేయించాడు. జగనన్న ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు. సామాజిక విప్లవానికి తెర తీశారు. అంబేద్కర్ కోరుకున్నట్లు పాలన చేస్తున్నారు. పేద వారి పక్షాన జగనన్న ఉన్నాడని, గుడ్డ కాల్చి ముఖంపై వేయాలని చూస్తున్న చంద్రబాబు. ఏ ఆస్పత్రికి వెళ్లినా చూపించుకుని వచ్చేలా ఖర్చులకు డబ్బులిస్తున్న జగనన్న. 31 లక్షల ఇళ్లపట్టాలిస్తే అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. రూ.2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు పంచితే అగ్ర తాంబూలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. ఉద్యోగాలు ఇస్తే 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. ఇంతకు ముందెన్నడూ ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్రబాబు మోసగాడు, 14 ఏళ్లు అబద్ధం రాష్ట్రాన్ని పాలించింది. నాలుగున్నరేళ్ల నుంచి ఒక నిజం పాలిస్తోంది. సామాజిక విప్లవం పరిఢవిల్లుతోంది. చంద్రబాబును నమ్మొద్దు, మోసగాడు, దగాకోరు. రాష్ట్రానికి జగనన్న సీఎం కావడం మనకు అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరం అని అన్నారు.