వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపి నందిగం సురేష్ మాట్లాడుతూ.... ప్రతి కుటుంబంలో ఒక పెద్దలా, కుటుంబ సభ్యుడిలా, పెద్దకొడుకులా మారి మన సమస్యలు వింటున్న జగనన్న. జగనన్న ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. జగనన్నను మిస్ చేసుకుంటే రాక్షసుడు వస్తాడు. మనందరం ఇబ్బంది పడతాం. మన పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలన్నా, అవ్వాతాతలు పింఛన్లు సమయానికి తీసుకోవాలన్నా, నాడు-నేడు స్కూళ్లు బాగుండాలంటే, విద్యా, వైద్యం, పేదవాడి ఆరోగ్యం, రైతులు బాగుండాలంటే జగనన్న రావాలి. తనకున్న సంపద కాకుండా మన కంచంలో కూడు లాగేసుకోవాలనుకొనే వ్యక్తి చంద్రబాబు. సామాన్యుడు, వ్యవసాయ కూలీ కొడుకు గ్రీన్ ఇంకుతో సైన్ చేసే అవకాశం వచ్చిందంటే జగనన్న కారణం. చంద్రబాబును నమ్మి బాగుపడిన వ్యక్తి లేరు. వైయస్ ఫ్యామిలీని నమ్మి చెడిపోయిన వారు లేరు. జగనన్న పేదవాడి ప్రేమకే బానిస తప్ప ఎవడికీ బానిస కాదు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంది. నా ఆశయాలను మీ జీవితాలను గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చెబుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని అభిమానాన్ని చాటుకున్నారు.