వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ.... బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్న పట్టాభిషేకం ఈ బస్సు యాత్ర. దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్నది చంద్రబాబు. దళితులను అక్కున చేర్చుకొని అన్ని విధాలుగా సంక్షేమం, అభివృద్ధి, అవకాశాలు కల్పించిన ముందు పెట్టిన నాయకుడు జగనన్న. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు. బీసీలకు కార్పొరేషన్లు, పదవులిచ్చి అందలం ఎక్కించిన నాయకుడు జగనన్న. గిరిజనులకు మొండి చేయి చూపిన చంద్రబాబు. గిరిజనులకు కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్య, అన్ని సదుపాయాలు, సంక్షేమం అందిస్తున్న నాయకుడు జగనన్న. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు. మైనార్టీలకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిన జగనన్న. సామాజిక సాధికారతకు వేదికపై నిల్చున్న ప్రతి ఒక్కరూ నిలువెత్తు సాక్ష్యం. సామాజిక సాధికారత అంటే పేదవాడి ఇంటికి కార్పొరేట్ వైద్యం అందడం. రేషన్ ఇంటి వద్దకు అందడం, అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందడం. రాజధాని ఎక్కడో ఉండటం కాదు, గ్రామ గ్రామాన సచివాలయాల పరిపాలన ప్రజల ముందే సామాజిక సాధికారత అందుతుంది అని అన్నారు.