కర్నూలు, ఒంగోలు వైద్యకాలేజీల్లో గంజాయి బ్యాచ్‌ల దాడులతో మెడికల్ కాలేజీలు డ్రగ్స్‌కు అడ్డాలుగా మారాయని స్పష్టమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘‘ప్రజల ఆరోగ్యాలను కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆసుపత్రిలో పేషెంట్లు అయ్యారు. కొంతమంది మెడికోల హింసాత్మక ప్రవర్తన చూశాక రాష్ట్రంలోని పరిస్థితులపై భయమేస్తోంది. ఏపీలో గంజాయి తీవ్రత పెరిగింది. పాలకులు పట్టించుకోరు.. డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలే యుద్ధం చేయాలి. మీకు టీడీపీ అండగా ఉంటుంది. పిల్లలు మత్తుకి బానిసలు కాకుండా కాపాడుకుందాం’’ అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.