పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం కోనంకిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... వెళితే నరేష్ (30), మాధురి దంపతులు కోనంకిలో నివాసముంటున్నారు. అయితే వీరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భర్త నరేష్‌తో పాటు అత్తమామలు ఆదిలక్ష్మి(47), సాంబశివరావు(50) ను భార్య తరపు బంధువులు నరికి చంపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో మాధురితో పాటు పలువురు నిందితులు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.