కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం మానుకోవాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని రైల్వేస్టేషన్ లో గురువారం నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో లక్షల మంది ఉద్యోగులు భద్రతను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు జగన్ మోహన్ రెడ్డి, ఆంజనేయులు, నరసింహమూర్తి పాల్గొన్నారు.