కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక నిర్వహించారు. ఉదయం 4.45 నుంచి 5.45 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి వద్ద కొలువుంచి పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.