విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పడవలు కోల్పోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీల్లా నేను ఎప్పుడు మత్స్యకారులను ఓట్ బ్యాంకులా చూడలేదు.మీరు నాకు అన్నతమ్ముడి లాంటి వారు, మీకు ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాను. తెలంగాణలో బీజేపీ, జనసేన ఎన్నికల్లో సమిష్టిగా వెళితున్నాయి. సీరియస్ క్యాంపెయిన్ ఆపి మీరు కష్టంలో ఉన్నారని వచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.