శుక్రవారం మన్యం సీమలోని పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ముగిసింది. అనంతరం బస్సు యాత్రలో వైయస్సార్ సీసీ ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ ప్రజాప్రతినిధులు కలసి నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలసి ముచ్చటించారు. అలాగే అభివృద్ధి పనులను పరిశీలన చేసారు. అనంతరం భారీ ఎత్తున బైక్ ర్యాలీ పాలకొండ జంక్షన్ కు చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతితో పాటుగా పలు కార్పొరేషన్లకు చెందిన డైరక్టర్లు హాజరయ్యారు.