గత ప్రభుత్వాలు అసమర్థ పాలన కారణంగా ఏ వర్గానికి న్యాయం జరగకపోతే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ సామాజిక సాధికారత సాకారం చేసారని పాలకొండ ఎమ్మెల్యే కళావతి అన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. నాడు - నేడు ద్వారా స్కూల్స్ ను ఆధునాతన బోధన ద్వారా విద్యార్థులకు సాంకేతిక విజ్జానాన్ని జగన్ అందిస్తున్నారన్నారు. ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో సీఎం వైయస్ జగన్ ఎక్కడా రాజీ పడటం లేదని, ఏజెన్సీలో పోడు భూమి పట్టాలివ్వడంతో పాటుగా రైతు భరోసాను కల్పించారన్నారు. వాలంటీరు, సచివాలయ వ్యవస్థల ద్వారా గిరిజన విద్యావంతులైన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న వైయస్ జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి అందరూ కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. పాలకొండ అంటే వెనుకబడిన ప్రాంత నియోజకవర్గం కానే కాదని, జగనన్న పాలనకు దిక్సూచిగా నిలిచేలా రూపుదిద్దుతున్నారన్నారు.