దేశంలోని పలు రాష్ట్రా ల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. గుజ రాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వచ్చేవారం దక్షిణ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
ఆదివారం మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రారు గఢ్‌లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బంగా ళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోం దని, దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా రాజధాని చెన్నైలోని పాఠశాలలు మూతపడ్డాయి.
అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్నిచోట్ల ఆదివారం వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. హిమాచల్‌లోని ఎత్తయిన కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తుందని అంచనా వేసింది. దీని కారణంగా మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతుందని, త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కశ్మీర్‌లో ప్రస్తుతం పొగమంచు పెరగ్గా.. రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వివరించింది.