రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ జైపూర్ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగగా 68 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ క్రమంలో జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని గ్రామస్తులు అనేక ఏళ్లుగా నాయకులను కోరగా వాళ్ళు పట్టించుకోలేదని వాపోయారు.