వైకాపా ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో రాజ్యాంగాన్ని విస్మరించి దోపిడీ పాలన సాగిస్తుందని బాపట్ల తెదేపా ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలో ఆదివారం రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. తెదేపా శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.