వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.... గత పాలకుడి వివక్షకు, మోసానికి, చిన్నచూపునకు, వంచనకు గురైన వర్గాలను నా వర్గాలు అన్న జగనన్న. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పేదరికంతో బాధపడుతున్నారని, ఆ వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగనన్న. అధికారంలోకి వచ్చాక వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేలా పాలన చేస్తున్నారు. సామాజిక సాధికారత అంటే ఇదీ అని దేశానికి చూపిస్తున్నారు. అబద్ధం, మోసం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబు. పేదోడికి జబ్బు చేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టాల్సి వచ్చేది. పేదల ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆలోచించాడా? ఆరోగ్యశ్రీ ఇచ్చి ఈ వర్గాల ప్రాణాలకు బాసటగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి మనవాళ్లు చదవడానికి కారణమయ్యారు. 2014లో మళ్లీ మోసపు హామీలతో గెలిచి ఆరోగ్యశ్రీని సగానికి తీసేసిన బాబు. ఫీజురీయింబర్స్‌మెంట్ కి శ్లాబు విధించాడు. ఇలా బీసీలను మోసం చేశాడు. అబద్ధం ఇప్పుడు ఆరు తలలుగా ప్రజలను పట్టి పీడించడానికి వస్తోంది. ఈ కుట్రలను ప్రజలు గమనించాలి. కులగణన ప్రారంభించిన ఘనత జగనన్నది. అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించిన సంస్కర్త సీఎం జగన్ అని చాటిచెప్పారు.