వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.... ఏ నియోజకవర్గానికి వెళ్లి సాధికార యాత్ర చేసినా అదొక సంబరంలా జరుగుతోంది. వేలాది మంది జనం వస్తున్నారు. గతంలో చంద్రబాబు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అవమానించారు. మత్స్యకారులను తోలుతీస్తానన్నాడు. నాయీబ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖరాసిన ఘనుడు. చంద్రబాబును విడిచిపెట్టం. పిడికిలి బిగిద్దాం. నడుం కడదాం. బాబు శాశ్వతంగా రాజకీయాల్లోంచి విరమించేదాకా విశ్రమించం. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించాడు చంద్రబాబు. ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్‌లో ఒక్కరికీ అవకాశం ఇవ్వని బాబు. నేడు జగనన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఈబీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలిచ్చారు. ఆ అవకాశాలే ఇప్పుడు ఈ వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీటీసీల రూపంలో బడుగు బలహీన వర్గాల సైన్యంగా మీముందుకు వచ్చింది. చంద్రబాబు దగ్గర బానిసత్వం చేస్తున్న యనమల రామకృష్ణుడు. బీసీల్ని అవమానిస్తే అడగలేదు. అప్పుడూ అదే బడ్జెట్, ఇప్పుడూ అదే బడ్జెట్, ప్రతి ఇంటికీ లక్షల రూపాయలు జగనన్న సాయం చేశారు. చంద్రబాబు చేయగలిగాడా? నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత జగనన్నది. రూ.5 లక్షలతో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి అని టీడీపీ అంటే.. కోటి రూపాయలతో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్‌లు కట్టిన ఘనత మనది అని తెలియజేసారు.