వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.... బడుగు, బలహీన వర్గాలు జగనన్నను గుండెల్లో పెట్టుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 70–80 శాతం బడుగు బలహీన వర్గాలకు జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరిగింది. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా వెలగబెట్టి ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పదవులు డబ్బులకు అమ్ముకున్నాడు. అదే జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. రూ.1,735 కోట్లు తుని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి డీబీటీ ద్వారా అందజేశారు. నాలుగు సంవత్సరాల్లో 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. ఇందులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అని అన్నారు.