వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... 70 శాతానికిపైగా మంత్రి పదవులు, 50 శాతం పైగా కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ పదవులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకిచ్చిన జగనన్న. జగనన్న పరిపాలనలో నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో తొలిసారి బీసీని మంత్రిగా చేసిన జగనన్న. మాకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు గొర్రెలు కాచుకొనేవాళ్లని మాట్లాడారు. నా తండ్రి, నా తాత ముత్తాతలు గొడ్లు, ఆవులు కాచుకున్నాం. గర్వపడుతున్నాం. మనం మొక్కే శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గొర్రెలు, ఆవులు కాచినవాళ్లే. జగనన్న సారథ్యంలో పని చేస్తున్నందుకు తలెత్తుకొని బతుకుతున్నాం. గర్వంగా ఫీలవుతాం. వేంకటేశ్వర స్వామి ఆలయం గుడి తెరిచేది యాదవులే. అది ఒక వరం. ఇలాంటి వరాన్ని 1996లో సన్నిధిగొల్లలకు వంశపారంపర్యం బాబు తీసేస్తే ఏం చేశారు? జగనన్న వచ్చాక మళ్లీ పునరుద్ధరించారు. మత్స్యకార సోదరులను చంద్రబాబు అవమాన పరిస్తే ఇదే తెగకు చెందిన వారిని రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది. రాబోయే ఎన్నికలు బలిసిన వాళ్లకు, బక్కచిక్కిన వాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. బలిసినోడి పక్కన బాబు, పవన్ ఉన్నారు. బక్కచిక్కిన వారి పక్కన జగనన్న ఉన్నాడు అని అన్నారు.